WhatsApp new updates: వాట్సాప్‌లో Instagram Reels ఆప్షన్ వస్తోందా ?

Whatsapp latest updates about privacy policy and Instagram Reels: వాట్సాప్‌ యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తూ తమ యాప్‌ని అప్‌డేట్ చేస్తోంది Whatsapp parent company అయిన ఫేస్‌బుక్. 

  • Mar 12, 2021, 17:48 PM IST

Whatsapp latest updates: Whatsapp to get Instagram Reels అందులో భాగంగానే వాట్సాప్‌లో కొత్తగా మరో అప్‌డేట్ రాబోతోంది. అదేమంటే.. వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ని ప్లే చేసుకుని చూసుకునే ఫీచర్ యాడ్ కాబోతోందన్నమాట.

1 /7

వాట్సాప్‌లో కొత్తగా రాబోయే మరో అప్‌డేట్ గురించి WABetaInfo ముందే లీకులు ఇచ్చేసింది. వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ని ప్లే చేసుకుని చూసుకునే ఫీచర్ యాడ్ కాబోతోందనేది WABetaInfo వెల్లడించింది.

2 /7

వాట్సాప్‌లో వచ్చే కొత్త కొత్త ఫీచర్ అప్‌డేట్స్‌పై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి పెట్టిన WABetaInfo ట్విటర్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. 

3 /7

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లింకుని Android users వాట్సాప్‌లో షేర్ చేసుకున్నప్పుడు ఆ లింక్ ప్లే అవుతోందని పేర్కొన్న WABetaInfo.. ఇక చెక్ చేయాల్సింది iOS users ఉపయోగిస్తున్న వాట్సాప్‌లో మాత్రమేనని స్పష్టంచేసింది.

4 /7

ఫేస్‌బుక్‌లో Instagram stories లేదా WhatsApp stories ప్లే అయ్యే ఆప్షన్స్‌ని సైతం ఫేస్‌బుక్ ఇన్‌క్లూడ్ చేసినట్టు ఈ సంస్థ తెలిపింది.

5 /7

ఇదిలావుంటే, మరోవైపు WhatsApp privacy policy విషయంలో వాట్సాప్‌కి యూజర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే.

6 /7

అయితే, తాము తీసుకొస్తున్న కొత్త ప్రైవసీ పాలసీ గురించి మరిన్ని అంశాలను WhatsApp alerts ద్వారా వాట్సాప్ యూజర్స్‌కి స్పష్టత ఇవ్వనున్నట్టు వాట్సాప్ ఇటీవలే ప్రకటించింది.